రోజూ ఇలాచీలు తిని చూడండి.. 

Narender Vaitla

26 November 2024

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇలాచీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని మంచి గుణాలు కడుపుబ్బరం, గ్యాస్‌, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

ఇలాచీలు మానసిక ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తాయి. ఆందోళన, ఒత్తిడి వంటివి దూరమై ప్రశాంతత సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలాచీలు సహజ మౌత్‌ ఫ్రెషనర్‌గా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు రోజూ ఇలాచీలు నమలడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

గుండె ఆరోగ్యానికి కూడా ఇలాచీలు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని మంచి గుణాలు రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె సమస్యలను దరిచేరకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

హై బీపీతో బాధపడేవారు కూడా ప్రతీ రోజూ ఇలాచీలను నమలాలి. ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇలాచీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. డీటాక్సిఫికేషన్ ఇలాచీ ఆరోగ్యానికి చాలా మంచిది. యూరిన్ ఫ్లో పెంచడంతో పాటు శరీరం నుంచి విష పదార్ధాలు బయటకు తొలగిస్తుంది.

శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఇలాచీ ఉపయోగపడుతుంది. పురుషుల్లో శీఘ్ర స్కలన సమస్యను, అంగస్తంభన సమస్యను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.