16 April 2024
TV9 Telugu
Pic credit - Pixabay
భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోంది. దీంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
శరీరంలోని ఏ భాగంలోనైనా కణాలు అనియంత్రితంగా పెరగడం ప్రారంభించినప్పుడు.. అది క్యాన్సర్‌కు కారణమవుతుంది.
మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ చెప్పారు.
క్యాన్సర్ రోగుల్లో చాలా మందిలో ఈ మూడు లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయని అంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ చెబుతున్నారు.
ఎటువంటి కారణం లేకుండా మీ బరువు అకస్మాత్తుగా తగ్గితే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ సందర్భంలో వైద్యుడిని సంప్రదించాలి.
శరీరంలో ఒక గడ్డ ఏర్పడి నొప్పి లేకుండా ఉంటే.. అది క్యాన్సర్ లక్షణం. 90 శాతం కేసులలో క్యాన్సర్ కారణంగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.
మీ శరీరంలో తేలికపాటి జ్వరం ఎప్పుడూ ఉంటే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
ఎటువంటి శారీరక శ్రమ చేయకపోయినా, నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తే ఇది కూడా క్యాన్సర్ లక్షణం కావచ్చు.
అయితే రొటీన్ స్క్రీనింగ్, ముందుగానే గుర్తించడం, తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతును అడ్డుకోవచ్చు.