గాడితప్పిన జీవనంతో క్యాన్సర్‌ ముప్పు

14 September 2023

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ వణికిస్తోన్న మహమ్మారి క్యాన్సర్‌. ఎప్పుడు.. ఎవరికి.. ఎందుకు.. వస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు

క్యాన్సర్‌  నివారణకు సుదీర్ఘకాలంగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ యాభై ఏళ్లలోపు వారిలో క్యాన్సర్‌ ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది

క్యాన్సర్‌ రక్కసి బారినపడి ఎంతోమంది ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్నారు. సరైన వైద్యం అందక ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీ తాజా పరిశోధనల్లో గత మూడు దశాబ్దాల్లో 50 ఏళ్లలోపు వయస్కుల్లో క్యాన్సర్‌ కేసులు 79శాతం పెరిగినట్లు వెల్లడైంది

ముఖ్యంగా 1990 దశకం తరవాత శ్వాసకోశ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు ఎక్కువైనట్లు తేలింది. 2019 ప్రారంభంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు అధికంగా వెలుగుచూశాయి

ప్రపంచ వ్యాప్తంగా పేగు, జీర్ణాశయ, శ్వాసనాళం, రొమ్ము క్యాన్సర్ల వల్ల అధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి

2030 నాటికి క్యాన్సర్ల బాధితుల సంఖ్య 31 శాతం, క్యాన్సర్‌ మరణాలు 21శాతం పెరుగుతాయిన ఎడిన్‌బరో యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు

నగరాలతో పోలిస్తే పల్లెల్లో జీవించే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ తలెత్తే ప్రమాదం తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి

జీవనశైలి, ఆహార అలవాట్లు, అధిక బరువు, మాంసాహారం, ఉప్పు అధిక వినియోగం, పండ్లు - పాలను తగినంతగా తీసుకోకపోవడం క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు