అన్ని కార్లకు సన్‌రూఫ్ పెట్టుకోవచ్చా..?

04 September 2024

Battula Prudvi 

కార్లలో సన్‌రూఫ్‌ అంటే ఒకప్పుడు అదో వింత. ప్రత్యేకమైన లగ్జరీ ఫీచర్‌. హై ఎండ్‌ కార్లలోనే ఎక్కువగా కనిపించేవి.

ప్రస్తుతం ప్రతి లగ్జరీ కారులో సాధారణం అయిపోయిన సన్‌రూఫ్. అనేక మధ్య-శ్రేణి కార్లలో కూడా సన్‌రూఫ్‌లు వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన చాల కార్లలో కూడా సన్‌రూఫ్‌ అనే స్పెషల్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంటోంది.

ఈ సన్‌రూఫ్‌లు కారు క్యాబిన్‌లోకి స్వచ్ఛమైన గాలి, సహజ కాంతిని వస్తాయని భావిస్తుంటారు. అందుకే చాలా మంది కొనుగోలుదారులు సన్‌రూఫ్ కార్లను కోరుకుంటారు.

సన్‌రూఫ్ లేని కార్లు మార్కెట్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఏ కారులోనైనా సన్‌రూఫ్‌ను తయారు చేయవచ్చో లేదో తెలుసుకోవడం మంచిది.

మీరు అన్ని కార్లలో సన్‌రూఫ్‌లను అమర్చలేరు. దీనికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్ని కార్ల టాప్ డిజైన్ దీనికి మద్దతు ఇవ్వదు.

మీరు బయట నుండి సన్‌రూఫ్‌ను ఇన్‌స్టాల్ చేస్తే అది కారు భద్రతపై ప్రభావం చూపుతుంది. మీ కారును విక్రయించినప్పుడు తక్కువ ధరను పొందాల్సి వస్తుంది.

వివిధ రాష్ట్రాల్లో సన్‌రూఫ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి నియమాలు ఉన్నాయి. కోల్‌కతా వంటి నగరాల్లో సన్‌రూఫ్‌ను తొలగిస్తే, రూ. 1,000 చలాన్ ఉంటుంది.