80 ఏళ్లు దాటిన వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువనీ, 55-64 ఏళ్ల వయసు ఉన్న వారిలో అవగాహన కల్పించాలంది ఈ నివేదిక.
నాలెడ్జ్ గ్యాప్, అధికంగా పనిచేయకపోవడం వంటి అడ్డంకులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన పెంచడం ఎంతో అవసరం.
అన్నీ అనుకూలంగా ఉన్నవారు సాంకేతికతపైనా, స్మార్ట్‌ఫోన్‌ల వాడకంపైనా ఆసక్తి చూపినప్పటికీ దాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు.
కొంతమంది భారతీయ వృద్ధులకు ఇప్పటికీ కుటుంబ సంరక్షణే భారంగా మారుతోంది. మరి కొందరు సంపన్నులను అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి.
నివేదిక ప్రకారం.. ఇండియా 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించాలంటే వృద్ధులు సైతం పనిచేయాలని గతంలో కొందరు అభిప్రాయపడ్డారు.
మెకిన్సే 21 దేశాల్లోని 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న దాదాపు 21,000 మందిపై సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. అందులో 1,000 మంది భారతీయులున్నారు.
అంతర్జాతీయంగా ఇంకా పనిచేయాలనుకునే వృద్ధులతో పోలిస్తే భారతీయ వృద్ధులకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు మెకిన్సే హెల్త్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ రిపోర్ట్ పేర్కొంది.
ఆర్థిక ప్రణాళిక, నైపుణ్య శిక్షణతో దిగువ మధ్యతరగతి వృద్ధుల కుటుంబాల్లో ఆదాయ మార్గాలను పెంపొందించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.