రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పేరు, ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు..?

29 November 2024

TV9 Telugu

రైలు టిక్కెట్‌పై ప్రయాణీకుడి పేరును మార్చవచ్చు. ఈ సదుపాయం కేవలం కౌంటర్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ట్రైన్ టికెట్ పేరు మార్చుకునే అవకాశం కుటుంబ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరొకరికి ఈ సదుపాయం ఉండదు.

రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి అప్లికేషన్‌తో పాటు ఇద్దరి ప్రయాణీకుల IDని అధికారులు చూపి టికెట్‌పై కొత్త పేరు నమోదు చేస్తారు.

మీరు ప్రయాణ తేదీని మార్చాలనుకుంటే, రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు కౌంటర్ వద్ద కొత్త ప్రయాణ తేదీతో దరఖాస్తు చేసుకొని భర్తీ టిక్కెట్‌ను తీసుకోండి.

ఆన్‌లైన్ టిక్కెట్‌పై పేరు లేదా తేదీని మార్చుకునే సౌకర్యం లేదు. ఈ సౌకర్యం కౌంటర్‌లో కొనుగోలు చేసిన వారికి RAC టిక్కెట్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది.

తత్కాల్ టిక్కెట్‌పై పేరు, తేదీని మార్చుకునే సౌకర్యం లేదు. ఈ సౌకర్యం సాధారణ బుకింగ్ లేదా RAC టిక్కెట్లకు మాత్రమే. బుకింగ్ సమయంలో దీన్ని గుర్తుంచుకోండి.

పేరు లేదా తేదీని మార్చుకునే సదుపాయం ఒక్కసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మళ్లీ ఎలాంటి మార్పు ఉండదు.

టిక్కెట్‌లో మార్పు కోసం ఇద్దరు ప్రయాణికుల ID అవసరం. దరఖాస్తుతో పాటు అన్ని పత్రాలను సకాలంలో సమర్పిస్తే ప్రక్రియ సులభం అవుతుంది.