పెరుగుతో ముడతలు, నల్లని మచ్చలు మటుమాయం.. కాంతివంతమైన చర్మం కోసం..
30 December 2023
TV9 Telugu
పెరుగులో ఉండే పోషకాలు, యాంటీ ఇన్ ప్లామేషన్ గుణాలు చర్మ సమస్యలను తగ్గించి ఫేస్‌ను అందంగా కనిపించేలా సహాయపడతాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. మొండి నల్లటి మచ్చలను తొలగిస్తుంది. అలాగే తలలో ఉన్న చుండ్రును కూడా పెరుగు తొలగిస్తుంది.
పెరుగును ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే మచ్చలను, మొటిమలను, నలుపుదనాన్ని సులభంగా తగ్గిపోతుంది.
పెరుగును మీ చర్మ తత్వాన్ని బట్టి వాడాలి. జిడ్డు చర్మం ఉన్న వారు పుల్లటి పెరుగును వాడాలి. పొడి చర్మం ఉన్న వారు తియ్యటి మీగడ పెరుగును ఉపయోగించాలని వైద్యులు చెబుతున్నారు.
ఒక గిన్నెలో టీ స్పూన్ పెరుగును తీసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ గోధుమ పిండిని కలుపుకోవాలి. ఈ గోధుమపిండి ఫేస్‌కు బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది. ఈ మిశ్రమాని ఫేస్‌కు పట్టించాలి.
అయితే జిడ్డు చర్మం ఉన్న వారు ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కొద్ది సేపు ఆరిన తర్వత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం, మృత కణాలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది.
ప్రతిరోజు పెరుగుతో ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో కాంతివంతంగా, అందం కనిపిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.