చెడు కొలెస్ట్రాల్ అంతుచూసే బాదం.. రోజూ కాసిన్ని తిన్నా చాలు
13 October 2024
TV9 Telugu
TV9 Telugu
డ్రైఫ్రూట్స్‌లో బాదంకి ప్రత్యేక గుర్తింపు ఉంది. రుచిగా ఉండటంతోపాటు తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేనా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం
TV9 Telugu
బాదం బలవర్థక ఆహారం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.. వంద గ్రాముల బాదం నుంచి దాదాపు 579 కేలరీలు అందుతాయి. సుమారు 49 గ్రాముల కొవ్వులు, 21 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి
TV9 Telugu
ఇందులో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, లాంటి ఖనిజాలూ, ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. మాంసకృత్తులతోపాటు పీచూ కూడా ఎక్కువగానే ఉంటుంది
TV9 Telugu
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఆరోగ్యాన్నిచ్చే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్-ఇ శాతం ఎక్కువే
TV9 Telugu
ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అధిక పిండిపదార్థాలుండే ఆహారానికి బదులుగా వీటిని తీసుకుని బరువును కూడా సులువుగా నియంత్రించుకోవచ్చు
TV9 Telugu
మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎముకలు, దంతాలు బలంగా మారేలా చేస్తుంది. రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది. జుట్టు సమస్యలను సైతం తగ్గిస్తుంది
TV9 Telugu
దీనిలోని విటమిన్-ఇ చర్మంలోని కొల్లాజెన్‌ను రక్షించి చర్మం ఎక్కువ కాలంపాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. రోజూ గుప్పెడు తింటే చాలు కావాల్సిన శక్తి లభించడమే కాకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది
TV9 Telugu
అయితే వీటిని నేరుగా కాకుండా నానబెట్టి పొట్టు తీసి తింటే వీటి నుంచి లభించే పోషకాలు మొత్తం శరీరానికి అందుతాయి. వీటిని పిల్లలు, పెద్దలు.. ఎవరైనా సరే నానబెట్టుకుని తినొచ్చు