కాల్షియం లోపాన్ని జయించడంలో ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీన్స్, బ్రోకలీ, బచ్చలికూర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇక సోయాబీన్‌తో కూడా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సోయానీబ్‌ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నాన్‌వెజ్‌తో కూడా కాల్షియం లోపాన్ని జయించవచ్చు. ముఖ్యంగా సాల్మన్ చేప, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే చికెన్, మటన్‌లో కూడా కాల్షియం ఉంటుంది.
శరీరానికి సరిపడ కాల్షియం కోసం ప్రతిరోజూ 2 నారింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది.
ఉసిరికాయ కూడా కాల్షియం లోటును భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
నువ్వులు కూడా కాల్షియం లోపాన్ని జయించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క టీస్పూన్ నువ్వుల్లో 88 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
బాదంతో కూడా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. బాదంపప్పులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. రోజూ బాదంపప్పు తినడం వల్ల కాల్షియం లోపాన్ని జయించవచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.