వీటిని తినలేదంటే 40 ఏళ్లకే కీళ్లనొప్పులు గ్యారెంటీ
25 August 2024
TV9 Telugu
TV9 Telugu
క్యాల్షియం అనగానే ఎముకల పటుత్వమే గుర్తుకొస్తుంది చాలా మందికి. అయితే ఇది ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు. రక్తం మామూలుగా గడ్డ కట్టేలా చూడటం.. కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయటం నుంచి గుండె నార్మల్‌గా కొట్టువడం వరకు చాలా పనుల్లో పాలు పంచుకుంటుంది
TV9 Telugu
సాధారణంగా 40 ఏళ్ల పడిలో అడుగుపెట్టిన తర్వాత స్త్రీల శరీరం క్రమంగా అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. కీళ్ల, ఆర్థరైటిస్ నొప్పి వంటివి బయటపడుతుంటాయి
TV9 Telugu
అంతేకాకుండా మహిళల్లో ఎక్కువగా కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటుంది. ఈ రెండు పోషకాల లోపం ఏర్పడినప్పుడు, ఎముకల సమస్యలు కూడా పెరుగుతాయి. విటమిన్ డి సూర్యకాంతి నుంచి లభిస్తుంది. ఈ విటమిన్ కోసం సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. అయితే కాల్షియం కోసం ఆహారంపైనే ఆధారపడాలి
TV9 Telugu
అందుకే మహిళలు తమ ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పాలు, చిక్పీస్, చీజ్, పెరుగు వంటి ఆహారాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
కూరగాయలలో కాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా పాలకూర తినడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం తలెత్తదు. ఇందులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ కూడా ఉంటాయి
TV9 Telugu
కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో చియా గింజలు కూడా ముఖ్యమైనవే. వీటిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
చిక్‌పీస్, సోయాబీన్స్, చిక్‌పీస్, ముంగ్ బీన్స్, ఇతర పప్పు ధాన్యాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఓ గిన్నె పప్పులను చేర్చుకోవాలి.
TV9 Telugu
అలాగే ఎముకల ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు అందించే బాదంపప్పును కూడా తప్పనిసరిగా తినాలి. ఇవి క్యాల్సియంతోపాటు ఇతర పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి