బ్రకోలీతో బోలెడన్నీ ప్రయోజనాలు.. తెలిస్తే మీరే తినేస్తారు..

Jyothi Gadda

13 June 2024

బ్రకోలీ ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం నుంచి బరువు తగ్గడం వరకు దీంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.

బ్రకోలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్లు సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్​కు మంచి మూలం. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బ్రకోలీ డైట్లో చేర్చుకుంటే ఇందులోని నీటి శాతం వల్ల మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది మన శక్తిని పెంచుతాయి. రోజంతా యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.

బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్‌ సీ, బీటా కెరోటీన్‌ హానికర యూవీ కిరణాల రేడియేషన్‌ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది.

బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలలో ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. 

బ్రకోలీతో స్కిన్‌ సన్‌ డ్యామేజ్‌ అవ్వకుండా కాపాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. బ్రోకోలీతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

బ్రకోలీలో సాధారణంగా ఫైబర్‌, నీటి శాతం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. బ్రోకోలీలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి.

బ్రకోలీలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది శరీర మంటను కూడా తగ్గిస్తుంది. బ్రకోలీ మీ డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఇమ్యూనిటీ బూస్ట్‌గా పనిచేస్తుంది.