10 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో పెరిగే మొక్క ఎడారి మొక్క బ్రహజెముడు. దీని పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ కంటే అధికంగా పోషకాలు, ఔషధగుణాలున్నాయి.
ముళ్లు ఎక్కువగా ఉడడంతో ఎక్కువ మంది ఈ బ్రహ్మజేముడిని వ్యవసాయ పంట రక్షణ కోసం కంచెగా పెంచుతారు. పిండినల్లి తప్ప మరే ఇతర కీటకాలు ఆశించని ఇవి మంచి వాణిజ్య పంట.
ఎరుపు, గులాబి రంగులో అందంగా కనిపించే బ్రహ్మ జెముడు పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు B12, A, C విటమిన్లు ఉన్నాయి
బ్రహ్మ జెముడు పండులో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయి. కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇవి ఉపయోగపడతాయి.
బ్రహ్మజెముడు పండులో అమైనో ఆమ్లాలు, బీటాలైన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో మంచి సహాయకారి.
ఈ పండ్లలోని కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు, క్యాల్షియం అధికంగా ఉన్నాయి. ఇవి మధుమేహం, స్థూలకాయం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను నివారిస్తాయి.
బ్రహ్మజెముడు పండ్లను అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ఈ పండ్లలో సన్నని ముళ్ళు ఉంటుంది. కనుక తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వీటిని ఉపయోగించి జామ్లు, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు, టీ, హెర్బల్ ఆల్కహాల్ ను తయారు చేస్తున్నారు. అంతేకాదు వీటితో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తున్నారు.
ఈ బ్రహ్మ జెముడిని మిరాకిల్ ప్లాంట్, ఫ్రూట్ ఆఫ్ ఎర్త్ అని అంటారు. వీటితో చేసిన ఆహారం తినడం వలన బరువు తగ్గుతారు. అకాల వృధ్యాప్యాయాన్ని నివారిస్తుంది
జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, అల్సర్లు తగ్గించుకోవడానికి బ్రహ్మ జెముడు పండ్లు మంచి మెడిసిన్ అని మెక్సికన్లు నమ్ముతారు