అన్నంతోనూ అదిరిపోయే సౌందర్యం..! ఇలా ట్రై చేయండి

February  23, 2024

TV9 Telugu

వండిన అన్నం ఆకలి తీర్చడానికే కాదు చర్మానికి మేలిమి ఛాయను అందించడంలోనూ సూపర్‌గా పనిచేస్తుంది. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను కలిపి ఈ ఫేస్‌ప్యాక్‌ వేస్తే గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం అవుతుంది

రెండు టేబుల్‌ స్పూన్ల అన్నంలో తగినన్ని పచ్చిపాలు లేదా పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి

అన్నంలో ఉండే అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ముఖచర్మాన్ని తేమగా చేసి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నివారిస్తుంది

రెండు చెంచాల చొప్పున అన్నం తీసుకుని పులియబెట్టిన బియ్యం కడుగు, అరచెంచా చొప్పున తేనె, ఆరెంజ్‌ తొక్కలపొడి తీసుకుని పేస్టులా కలుపుకుని, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి

ఆరిన తర్వాత కడిగేయాలి. ఇందులోని పులిసిన బియ్యం నీళ్లు జిడ్డుని తగ్గించి మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలను దూరం చేస్తాయి. వారానికి కనీసం 2 సార్లు ఇలా చేస్తే చర్మం నిగారింపు రెట్టింపు అవుతుంది

రెండు చెంచాలు మెత్తగా చేసిన అన్నానికి, అదే పరిమాణంలో కీరదోస గుజ్జు తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ భాగాలకు పట్టించి పావుగంటాగి కడిగేయాలి

ఇందులోని కీరా చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. అలాగే విటమిన్‌- సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అలర్జీలను తగ్గించి అలసిన కళ్లకు ఉపశమనం కలిగించడమే కాకుండా కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గిస్తుంది

చెంచా చొప్పున క్యారెట్‌ ముక్కలు, అన్నం తీసుకుని మెత్తగా చేసుకుని ముఖానికి పట్టించి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి