ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పుని చేర్చుకోండి.. ఆ సమస్యలు పరార్..
15 July 2024
TV9 Telugu
Pic credit - pexels
సాధారణ ఉప్పు కంటే బ్లాక్ సాల్ట్ ను తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ బ్లాక్ సాల్ట్ ను పూర్వం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు
ఈ నల్ల ఉప్పు నల్లగా.. కొంచెం పింక్ షేడ్ తో పాటు గోధుమ రంగులో ఉంటుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్ లో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది.
నల్ల ఉప్పు టేబుల్ సాల్ట్ కంటే తక్కువ రుచిని కలిగి ఉంటుంది. బ్లాక్ సాల్ట్ సహజంగా ఖనిజాలతో నిండి ఉంటుంది. అయితే దీనిలో థైరాయిడ్ సంబంధిత వ్యాధులను నిరోధించే అయోడిన్ ఉండదు.
నల్ల ఉప్పులో ఉండే పోషకాలు పొట్టలో విటమిన్ల శోషణను పెంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగు పరచి అజీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. కనుక నల్ల ఉప్పును తగిన మోతాదులో ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.
నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్ తో పాటు క్యాల్షియం మెగ్నీషియం, పొటాషియం వంటి ఇతర మూలకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఉప్పుతో ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలున్నాయి.
బరువు తగ్గాలనుకునే వారికీ బ్లాక్ సాల్ట్ మంచి సహాయ కారి. ఇది లిపిడ్స్, ఎంజైమ్స్‌తో కరిగిపోతుంది. కనుక బరువుని అదుపులో ఉంచుతుంది.
నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిదని సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు.
నల్ల ఉప్పు వలన జలుబు, అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు ఉబ్బసం, సైనస్ సమస్యతో ఇబ్బంది పడేవారు వేడి నీటిలో నల్ల ఉప్పుని వేసి ఆ ఆవిరిని పీల్చడం వలన ఉపశమనం లభిస్తుంది.