నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలు ఉన్నాయా..? 

05 January 2025

Jyothi Gadda

TV9 Telugu

తెల్ల ఉప్పు వల్ల ఎన్నో లాభాలు ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరాన్ని చల్లగా చేయడంలో నల్ల అద్బుతంగా సహాయపడుతుంది.

TV9 Telugu

నల్ల ఉప్పు లివర్ ను డిటాక్స్ చేయడంలో అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించే విషయంలో నల్ల ఉప్పు తోడ్పడుతుంది. 

TV9 Telugu

వ్యాధులను తగ్గించడంలో నల్ల ఉప్పు సహాయపడుతుంది. ఇందులో లాక్సేటివ్ గుణాలు ఎక్కువగా ఉండి, మెటబాలిక్ రేటును పెంచడంతో పాటు కడుపును క్లీన్ చేస్తుంది. 

TV9 Telugu

గుండెల్లో మంట, ఉబ్బరాన్ని నల్ల ఉప్పు సులువుగా నివారిస్తుంది. నల్ల ఉప్పు జీర్ణాశయంను శుభ్రం చేయడంతో పాటు పైల్స్ ఉన్నవాళ్లకు ఆ సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.

TV9 Telugu

నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య సైతం సులువుగా తగ్గుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సైతం కొంతమేర తగ్గించడంలో నల్ల ఉప్పు ఉపయోగపడుతుంది.

TV9 Telugu

సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హైబీపి తగ్గుతుంది. ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ నల్ల ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. 

TV9 Telugu

నల్ల ఉప్పు వినియోగంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.అంతేకాదు, చర్మం, జుట్టు సమస్యలని కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంది.

TV9 Telugu

ఎంత మంచిదైనా కూడా నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్‌ని అందులో ఉన్న గుణాలని చూసి కొనాలి. అదే విధంగా, తక్కువ మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.

TV9 Telugu