03 December 2024
Pic credit - Getty
TV9 Telugu
బ్లాక్ బంగాళాదుంపలలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, కాపర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి లభిస్తాయి. కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. దాదాపు 87 కేలరీలు ఇందులో కనిపిస్తాయి.
నల్ల బంగాళాదుంపలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని సహాయంతో మీరు అనేక తీవ్రమైన వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చు.
కాలా పొటాటో గుండెకు చాలా ఆరోగ్యకరమైనది. దీనిలోని ఫైబర్, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి రక్తం గడ్డకట్టడం, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నల్ల బంగాళాదుంప శరీరంలో మంట సమస్యను తగ్గిస్తుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
నల్ల బంగాళాదుంపలను తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. మెదడు స్ట్రోక్, గుండెపోటు, శరీరంలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఈ నల్ల బంగాళాదుంప కాలేయానికి కూడా ఆరోగ్యకరమైనది. మీ కాలేయం నుంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
దీనిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు అదుపులో ఉంచుకోవాలనుకునేవారు సాధారణ బంగాళాదుంపలకు బదులుగా నల్ల బంగాళాదుంపలను తీసుకోవచ్చు.
నల్ల బంగాళాదుంపలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బ్లాక్ పొటాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినే ఆహారంలో చేరుకోవడం వలన స్కిన్ మెరుస్తుంది. చర్మంపై మచ్చలను నివారిస్తుంది.