మినప పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు.. దీనిని తీసుకోవడం ద్వారా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు పోషకాహర నిపుణులు.
TV9 Telugu
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మినప పప్పుతో చేసిన వంటకాలు డైలీ డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇంతకీ, మినప పప్పులో ఎలాంటి పోషకాలు ఉంటాయి?
TV9 Telugu
మినప పప్పులో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
TV9 Telugu
షుగర్బాధితులు మినప పప్పును డైలీ డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం.
TV9 Telugu
ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు.
TV9 Telugu
మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.బరువు తగ్గాలనుకునేవారికి మరింత మంచిది.
TV9 Telugu
మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
TV9 Telugu
బ్లాక్ ఉరద్ పప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యానికి మినప పప్పు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.