సాధారణంగా యాపిల్స్ ఎరుపు, పచ్చని రంగుల్లో ఉన్న యాపిల్స్‌నూ మనం చూస్తుంటాం. కానీ, బ్లాక్ యాపిల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా?
నిజమేనండీ ..ఆ రకమైన యాపిల్ పండ్లు కూడా ఉన్నాయి. కానీ, ఒక్కో యాపిల్ పండు ఖరీదు రూ.500 వరకు ఉంటుంది.
యాపిల్ జాతుల్లోనే ఈ పండుకు ప్రత్యేకత ఉంది. కేవలం చైనా, టిబెట్‌లోని న్యింగ్‌చీ పర్వత సానువుల్లో మాత్రమే ఇది పండుతుంది.
దీన్ని ‘బ్లాక్ డైమండ్ యాపిల్’ అని కూడా పిలుస్తారు. నల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది ఈ పండు.
పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉంటూ భలే రుచిగా ఉంటుందట ఈ యాపిల్ పండు. అతి తక్కువ ప్రాంతాల్లో పండించడం వల్ల దీనికి డిమాండ్ ఎక్కువ.
అందుకే దీని ధర కూడా ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా చైనాలోని ఉన్నతస్థాయి రిటైలర్లకు మాత్రమే వీటిని విక్రయిస్తారట. అది కూడా తక్కువ మొత్తంలోనే.
బ్లాక్ ఆపిల్ తొలి పంట చేతికందడానికి కనీసం 5 నుంచి 8 ఏళ్లు పడుతుందట. పర్వతసానువుల్లోనే ఈ పంటను పండించాల్సి ఉన్నందున పెద్ద మొత్తంలో సాగు చేయడం వీలుపడదు.
సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ పంట చేతికొస్తుంది. ఏడాదిలో అప్పుడప్పుడూ పండ్లు వచ్చినా.. వాటి రుచిలో మాత్రం తేడా ఉంటుందట.