యాలకులతో అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదలరు..!

Jyothi Gadda

16 June 2024

మసాల దినుసుల్లో.. యూలకులు చాలా ముఖ్యమైనవి. వంటలో మంచి రుచితో పాటు మంచి వాసనను కూడా ఇస్తాయి. యాలకులతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. 

యాలకుల్లో ఉండే యాక్సిడెంట్లు చర్మంపై అలర్జీలు రాకుండా చేస్తాయి. చర్మాన్ని కాంతి వంతంగా మెరిసేలా చేస్తాయి. యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలోని టాక్సిన్స్ ను బయటకుపంపుతాయి. 

యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలోని టాక్సిన్స్ ను బయటకుపంపుతాయి. యాలకులతో చేసిన స్క్రబ్ చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది.

ఒక టీ స్పూన్ తేనెలో యాలకుల పొడిని కలపాలి. దాన్ని మీ ముఖంపై అప్లై చేయాలి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. యాలుకల్లో ఒక రకమైన నల్ల యాలకుల వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. 

ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది. చర్మంలోని సెబమ్ ను తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. 

పెద్ద ఏలకులను గ్రైండ్ చేసి పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే అద్భుత ఫలితం ఉంటుంది. ఈ రెమెడీని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే మీ చర్మం ముడతలను వదిలించుకోవచ్చు. అన్ని రకాల చర్మ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

నల్ల ఏలకులను లవంగాల నూనెలో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్యలు నయమవుతాయి. నల్ల ఏలకుల లోషన్ తయారు చేసి ముఖానికి మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది.

నల్ల ఏలకులు ఆహార రుచిని పెంచడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా పని చేస్తాయి. చర్మానికి చాలా మేలు చేస్తుంది. నల్ల ఏలకులు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలను కలిగి ఉంటాయి.