14 December 2024
Pic credit - Social Media
TV9 Telugu
భూచక్రగడ్డ భూమిలో పది, పన్నెండు అడుగుల లోతున మీటరు నుంచి 20 మీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది.
ఈ దుంపను విటమిన్లు, ఖనిజాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. వనవాస సమయంలో రాముడు దీనిని తిన్నాడని చెబుతారు.
ఆఫ్రికన్ జర్నల్ ఆన్‌లైన్ ప్రకారం భూచక్రగడ్డలో అధిక మొత్తంలో విటమిన్ ఎ, సి, ఇ ఉన్నాయి. ఇందులో బి1, బి2, బి3లు కూడా ఉన్నాయి.
ఇందులో విటమిన్లు మాత్రమే కాదు ప్రొటీన్, పీచు, కొవ్వు, ఫైటోకెమికల్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటివి ఉన్నాయి.
భూచక్రగడ్డ ముఖ్య లక్షణం చల్లదనం కలిగించడం. అనే దీనిలో చల్లని స్వభావం ఉంది. కనుక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.
భూచక్రగడ్డ ఎముకలను రక్షించడంలో, జీర్ణక్రియ , రోగనిరోధక శక్తిని పెంచడంలో మంచి సహాయకారిగా పరిగణించబడుతుంది.
దీనిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంది కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.