జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి..!పట్టులాంటి..

Jyothi Gadda

3 September 2024

జుట్టుని ఆరోగ్యంగా చేయడంలో నూనె కీ రోల్ పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే నూనె రాయాల్సిందే. దీని వల్ల జుట్టు నిగనిగలాడుతూ అందంగా పెరుగుతుంది. 

జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు , జుట్టుకు విటమిన్లు, ఖనిజాలు , కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలను అందించడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ముందుగా జుట్టుని రెండు భాగాలుగా విడదీయండి. తర్వాత మెల్లిగా వేళ్ళతో చిక్కులు తీయండి. దీని వల్ల నూనె రాయడం ఈజీగా అవుతుంది. ఎక్కువగా చిక్కులు పడవు.

అదే విధంగా, స్కాల్ప్‌ని మసాజ్ చేయాలి. ఇది కూడా మీ చేతి వేళ్ళతో మెల్లిగా సర్క్యూలర్ మోషన్‌లో మసాజ్ చేయాలి. దీంతో బ్లడ్ సర్క్యూలేషన్ ఇంప్రూవ్ అయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టుకు బలం చేకూరుతుంది. దీంతో జుట్టు చిట్లకుండా, మెరిసేలా.. ఒత్తుగా కనిపించేలా చేస్తుంది

జుట్టుకి ఆయిల్ అప్లై చేసి ఎంతసేపు ఉండాలనేది మీ జుట్టు, స్కాల్ప్‌ని బట్టి ఉంటుంది. డ్రై హెయిర్, స్కాల్ప్ అయితే, రాత్రంతా ఉన్నా పర్లేదు. ఆయిలీ హెయిర్ వారు ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.

నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు మదృువుగా మారుతుంది. అంతేకాకుండా తేమను పెంచుతుంది. జుట్టుకు మంచి మెరుపును సంతరించుకుంటుంది.

బెస్ట్‌ రిజల్ట్స్‌ కోసం నూనెను అప్లై చేసిన తర్వాత కనీసం ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి వాష్‌ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.