వేసవి వేడికి గుడ్ బై చెప్పాలంటే ఇవి బెస్ట్ ప్రదేశాలు..

TV9 Telugu

27 March 2024

లడఖ్ చాలామందికి కలల గమ్యస్థానం. సాహస ప్రియులకు వేసవిలో భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

దక్షిణ భారతదేశంలో వేసవిలో సేదతీరడానికి మున్నార్ అనువైన ప్రదేశం. ఎక్కడ ప్రకృతి సౌదర్యంతో ఎవరైనా ప్రేమలో పడాల్సిందే.

మౌంట్ అబూ, రాజస్థాన్‌లోని ఎడారుల మధ్య ఉన్న హిల్స్ స్టేషన్. ఇక్కడ ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలో హాయిగా రిలాక్స్ అవచ్చు.

గాంగ్‌టక్ అత్యంత ఆకర్షణీయమైన జలపాతాలు, నదులు, మేఘాల దుప్పటి కొప్పుకున్న కొండలతో వీక్షకులను ఆకర్షిస్తుంది.

ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న హిల్ స్టేషన్ అయిన రిషికేశ్ సాహస యాత్రికులు, ప్రకృతి ప్రేమికులకు కేంద్రంగా ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

మంచుతో కప్పబడిన శిఖరాలు, హౌస్‌బోట్‌లు, ఎత్తైన దేవదార్ వృక్షాలతో దట్టమైన లోయలతో మీ విహారయాత్రను పరిపూర్ణంగా చేసే సుందరమైన అందాల స్వర్గం కాశ్మీర్.

ఈశాన్య భారతదేశంలోని డార్జిలింగ్ అతి తక్కువ మందికి తెలిసిన అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ హాయిగా తిరిగి రావచ్చు.

చీరపుంజి ప్రయాణికులకు అత్యంత సుందరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ప్రకృతి అందాలు మనసును హత్తుకుంటాయి.