భూతల స్వర్గమే ఈ ప్రాంతం.. పర్యాటకులకు మధురానుభూతి ఈ విశాఖ..
TV9 Telugu
04 February 2024
ఆ శ్రీమహావిష్ణువు వరాహ నరసింహస్వామిగా కొలువు తీరిన సింహాచలం విశాఖపట్నంలో కచ్చితంగా చూడవలసిన ప్రదేశం.
ప్రకృతి మధ్య పాలధార వాలే పారుతున్న కటికి జలపాతన్నీ చూస్తే పర్యాటకులకు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఇది విశాఖకు దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మేఘాల మధ్య విహరించాలంటే ఆంధ్ర కాశ్మిర్ గా పేరొందిన లంబసింగికి వెళ్ళాల్సింది. ట్రెకింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ఎంపిక.
విశాఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొజ్జన్నకొండా కూడా చూడదగ్గ ప్రదేశం. ఇది పురాత బౌద్ధ స్థూపాలకు ప్రసిద్ధి.
INS కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం కచ్చితంగా చూడాలి. ఇది 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో వీరోచితంగా పోరాడి కీలక పాత్ర పోషించింది ఈ సబ్‌మెరైన్.
TU 142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం కూడా విశాఖ పర్యాటకులకు మంచి అనుభూతి అనే చెప్పాలి. ఈ విమానం భారత నౌకాదళంలో 29 ఏళ్లపాటు సేవలందించింది.
విశాఖలో చూడవలసిన మరో ప్రాంతం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్. ఇక్కడ ఎన్నో రకాల ప్రాణులను మీరు చూడవచ్చు.
బుర్ర గుహలు కూడా పర్యాటకులు చూడదగ్గ ప్రదేశం. ఇది ఆరకు నుంచి చాల దగరలో ఉంటుంది. విశాఖకు దాదాపు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి