భువిలో స్వర్గం ఈ ప్రదేశం.. ఒక్కసారైన వెళ్లాల్సిందే..
TV9 Telugu
24 May 2024
శ్రీనగర్ ప్రధాన ఆకర్షణగా దళ్ సరస్సు. దాల్ సరస్సులో మీరు తప్పనిసరిగా సంప్రదాయ పడవ షికార్ చేయాలి. ఇక్కడవాటర్ సర్ఫింగ్ వాటర్ స్పార్ట్స్ చాలా ఫేమస్.
శ్రీనగర్‌లో అతి పురాతన ఆలయం శంకరాచార్య ఆలయం. మీరు ఇక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను స్పష్టంగా చూడవచ్చు.
దాల్ సరస్సుతో పాటు మీరు శ్రీనగర్‌లోని అంచల్ బాగ్, నిషాత్ బాగ్, పారి మహల్, బెరినాగ్, చష్మే షాహి, షాలిమార్ బాగ్‌లను తప్పక సందర్శించాలి.
జమ్మూ, కాశ్మీర్‌లోని అందమైన పచ్చదనాన్ని చూడాలనుకుంటే, వేసవి కాలంలో ఖచ్చితంగా గుల్మార్గ్ గొండోలాలో ప్రయాణించండి.
సోనామార్గ్‌లో ఉన్న థాజివాస్ గ్లేసియర్ ఎంతో అద్భుతం. వేసవిలో ట్రెక్కింగ్, శీతాకాలంలో మంచు కురుస్తుంది.
బేతాబ్ చిత్రం ద్వారా పేరు పొందిన కాశ్మీర్‌లోని అందమైన పహల్గామ్‌లో ఈ మనస్సును కదిలించే బేతాబ్ వ్యాలీ ఉంది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన ఈ మార్తాండ్ సూర్య దేవాలయం 8వ శతాబ్దం నుండి ఇక్కడ ఉంది.
పహల్గామ్‌లో ఉన్న ఈ అమర్‌నాథ్ గుహ కూడా భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది. దీని కోసం కొన్ని రోజులు ట్రెకింగ్ చెయ్యాలి.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో ఉన్న ఈ మాతా రాణి ఆస్థానానికి చేరుకుంటారు.
కార్గిల్ ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షించేలా వుంటాయి. ఈ ప్రదేశంలోనే 1999లో పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి