ఆరోగ్యకరమైన నిద్ర కోసం సింపుల్ టిప్స్..హాయిగా పడుకుంటారు.!
TV9 Telugu
08 February 2024
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక బరువు కూడా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే ఆందోళన , డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
మీరు మీ పనులను కూడా సరిగా చేసుకోలేకపోతారు. ఆరోగ్య నిపుణులు ప్రకారం నిద్రపోకపోవడం వల్ల హార్మోన్ క్రమబద్ధీకరణ, జీవక్రియ ఆటంకాలు వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది.
భోజనం చేసిన తర్వాత చిరుతిళ్లు, స్వీట్లు తీసుకోకుండా ఉండాలి. నిద్రకు ముందు పాలు, నీళ్లు తాగుతే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నీద్రకు ముందుగా మీ పనులను పూర్తిగా చేసుకోండి.
ఎలాంటి ఆందోళ, ఒత్తిడిని ఆలోచించకుండా ఉండాలి. మీరు ఒత్తిడి, ఆందోళనతో పడుకుంటే శరీరం నీరసంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు చేయకుండా పడుకోవడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది.
మంచి ఆరోగ్యం కోసం సుఖమైన నిద్ర చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎనిమిది గంటల పాటు ద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.