బరువు పెరగాలనుకునే వారు రోజూ పాలు తాగాలి. ఇందులోని క్యాల్షియం, ప్రోటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు పెరగడంలో తోడ్పడుతుంది.
బరువు పెరగాలనుకునే వారు అన్నం ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్‌కు పెట్టింది పేరైన అన్నం బరువు పెరగడంలో ఉపయోగపడుతుంది.
బరువు పెరగడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ శరీర బరువు పెరగడంలో తోడ్పడుతాయి.
బరువు పెరగాలనుకునే వారు అప్పుడప్పుడు రెడ్ మీట్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్ కండరాలను బలంగా చేయడంతో పాటు, శరీర బరువును పెంచుతుంది.
చేపలు కూడా బరువు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలను డైట్‌లో భాగం చేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
బరువు పెరగడంలో బంగాళదుంపలు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. బంగళదుంపలను ఏ రకంగా తీసుకున్న బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.
బరువు పెరగాలనుకునే వారు ప్రతీ రోజు కచ్చితంగా కోడి గుడ్డును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ బరువు పెరగడానికి ఉపయోగపడుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం