బట్టతల నుండి బయటపడటానికి బెస్ట్ హోం రెమెడీస్..జుట్టు గ్యారంటీ!

21 November 2023

జుట్టు రాలిపోవటం, నెరిసిపోవటం వంటి సమస్యలకు నువ్వులతో చెక్‌ పెట్టవచ్చు. దీనికోసం నల్ల నువ్వులను మెత్తగా నూరి నీళ్లలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. క్రమంగా జుట్టు నల్లబడుతుంది. 

ఆముదం బట్టతలకి అత్యంత శక్తివంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇందుకోసం కనీసం వారానికి ఒకసారి రోజ్ ఆయిల్‌తో పాటు ఆముదం కలిపి తలకు మసాజ్ చేసి తలస్నానం చేయాలి.

నీళ్ళు, షాంపూతో కలిపి ఆపిల్ సైడర్ వెనిగర్‌తో మీ జుట్టును కడగడం వల్ల స్కాల్ప్ pH సమతుల్యం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉసిరి పొడి, నిమ్మరసం కూడా జుట్టుకు మంచిది. ఈ రెండింటి మిశ్రమాన్ని పేస్ట్‌గా చేసిన జుట్టుకు పట్టించి 40 నిమిషాల తర్వాత వాష్‌ చేసుకోవాలి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్‌, బ్యాక్టీరియా సమస్యల నుండి కూడా రక్షిస్తుంది.

అలోవెరా జెల్‌ను కొద్ది మొత్తంలో జుట్టు మూలాలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల బట్టతల సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

నిమ్మరసాన్ని  కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దన చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, పొడి జుట్టు వంటి అనేక జుట్టు సమస్యలను నయం చేయవచ్చు.

గుడ్డులోని తెల్లసొనను మాస్క్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు మెరుస్తూ, మృదువుగా, ఒత్తుగా మారుతుంది.