పాలలో విటమిన్లు, ప్రొటీన్లు, లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. అందుకే పాలతో ఫేస్ ప్యాక్స్ తయారు చేసి ముఖానికి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్స్ తయారీ, ప్రయోజనాలు తెలుసుకుందాం.
గంధం, పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. 15-20 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసి, శుభ్రంగా కడిగిస్తే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. గంధం లక్షణాలు చర్మానికి మెరిసే ఛాయను అందిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకసారి వాడొచ్చు.
తేనె, పచ్చి పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ కూడా అద్భుతం చేస్తుంది. తేనె చర్మంలో తేమను నిలుపుతుంది. పాలు చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. ఈ ప్యాక్ డ్రై స్కిన్‌కి మంచిది. దీన్ని వారానికి ఒకసారి వాడొచ్చు. ముఖంపై 15-20 నిమిషాల అప్లై చేసి కడిగేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పసుపు, పచ్చి పాలతో కూడా ఫేస్ ప్యాక్ చర్మానికి నిగారింపునిస్తుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్రైటెనింగ్ లక్షణాలను కలిగిస్తుంది. పచ్చి పాలు తేమను జోడిస్తాయి. ఈ ప్యాక్ మచ్చలు, డార్క్ స్పాట్‌లను తగ్గిస్తాయి. వారానికి రెండుసార్లు ఇది వాడితే మార్పు చూస్తారు.
శనగపిండి, పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ మీ ముఖం మెరిసేలా చేస్తుంది. శనగపిండి నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. పచ్చి పాలు ఆయిల్ ఫ్రీ, ప్రకాశవంతమైన ఛాయను మెయింటైన్ చేస్తాయి. ఇది అప్లై చేశాక శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజింగ్ చేస్తే ఫలితాలు బాగుంటాయి.
దోసకాయ, పచ్చి పాల ఫేస్ ప్యాక్‌తో ఇరిటేటింగ్ స్కిన్, ఉబ్బినట్లు కనిపించే చర్మానికి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే, చర్మం పునరుజ్జీవనంతో కాంతివంతంగా మారుతుంది. దోసకాయలో సూథింగ్, కూలింగ్ లక్షణాలు పాలతో కలిసి అద్భుత ఫలితాలు ఇస్తాయి.
కలబంద, పచ్చి పాల ఫేస్ ప్యాక్ ముఖానికి వారానికి ఒకసారి 20 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత శుభ్రంగా కడిగిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కలబందలోని సూథింగ్, హీలింగ్ గుణాలు, పచ్చి పాలు పోషక ప్రయోజనాలతో కలిపి, ఇరిటేటింగ్ స్కిన్‌ను శాంత పరుస్తాయి.
ఓట్ మీల్, రా మిల్క్ ఫేస్ రెండు వారాలపాటు ఉపయోగిస్తే.. స్కిన్ స్మూత్ అవుతుంది. బ్రైట్‌నెస్ పెరుగుతుంది. ఓట్ మీల్ సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది, సెల్ టర్నోవర్‌ను ప్రోత్సహిస్తుంది. పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.