భార్యభర్తల మధ్య బంధం దృడంగా ఉండాలంటే.. వారి మధ్య ప్రేమ, నమ్మకం బలంగా ఉండాలి. ఈ బంధంలో ప్రేమ, కోపం, బాధ్యతలు, అలకలు అన్నీ ఉంటాయి. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది
వీరి బంధంలో గొడవ ఏది వచ్చినా.. అది ఎలా పరిష్కారం చేశారన్నది భార్యాభర్తల ప్రవర్తనపై ఆధారపది ఉంటుంది. గొడవ ఏది వచ్చినా.. బంధం కొనసాగాలంటే ఒకరు తగ్గడం చాలా ముఖ్యం.
ఈ మధ్యకాలంలో చాలామంది యువతులు ఇలాంటి భర్తే కావాలని కోరుకుంటుంటారు. వారికంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. మరి ఓ మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
భర్తకు విధేయత చాలా ముఖ్యం. భార్యాభర్తల బంధంలో మోసం అనేదానికి అస్సలు తావివ్వకూడదు. ఈ మోసం బంధాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే భర్త ఎప్పుడూ భార్యకు విశ్వాసంగా ఉండాలి. రహస్యం ఏదైనా షేర్ చేసుకోవాలి.
మంచి భర్త ఎప్పుడూ కూడా భార్యకు తగిన గౌరవం, సముచిత స్థానాన్ని ఇస్తాడు. మంచి భర్త ఎప్పుడూ కూడా తన భార్యను మహారాణిలా చూసుకుంటాడు. ఆమె గౌరవానికి భంగం కలిగించడు
మంచి భర్త ఎప్పుడూ కూడా తన భార్యను అర్ధం చేసుకుంటాడు. ఆమె కోరికలు, కలలు నెరవేర్చుకోవడానికి తన వంతు సాయం చేస్తాడు. ఆమె కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాడు. గొడవలు రానివ్వకుండా చూస్తాడు
మంచి భర్త ఎప్పుడూ కూడా తన భార్యకు అన్ని పనుల్లో సాయం చేస్తాడు. ఇంటి పనులు, పిల్లల పెంపకం ఇలా ఏదైనా సరే భార్యకి అండగా నిలబడతాడు
ప్రేమించే భర్త దొరికితే.. ఆ భార్య అదృష్టవంతురాలే.. ప్రేమించే భర్త ఎప్పుడూ భార్యపై కోపం చూపించడు. నలుగురిలో ఆమె గౌరవానికి భంగం కలిగించడు.