వర్షాకాలంలో గోవాలో ఈ ప్రదేశాలు మహా అద్భుతం..

TV9 Telugu

19 June 2024

వర్షాకాలంలో గోవాలో చూడవలసిన ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి దూద్‌సాగర్ జలపాతం. ఈ జలపాతం మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉంది.

వర్షాకాలంలో రివర్ రాఫ్టింగ్ ఉత్తమం. గోవాలోని మహదేయ్ నది రివర్ రాఫ్టింగ్‌కు అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు.

గోవాలోని సుగంధ ద్రవ్యాల తోటలను ఉత్తమ సమయం వర్షాకాలం. ఇక్కడ అనేక రకాల సుగంధ ద్రవ్యాలు వాటి సువాసనలతో గాలిని నింపుతాయి.

గోవాలోని వర్షాకాలంలో వన్యప్రాణుల సఫారీ పర్యటనకు వెళ్లడం కచ్చితంగా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పాలి.

వర్షాకాలంలో గోవాలో మొండోవి నదిలో సాయంత్రం పూట క్రూయిజ్ ప్రయాణం చేయాలి. ఇది 2 గంటల ప్రయాణం అద్భుతమైన అనుభవం.

గోవాలోని ఘాట్‌లలో రోడ్డు ప్రయాణం కూడా ఉత్తేజాన్నిస్తుంది. వర్షాకాలంలో ఉత్తమమైనవి చోర్ల ఘాట్‌లు, అంబోలి ఘాట్‌లు, అన్మోడ్ ఘాట్‌లు.

గోవా కోటలు వర్షాకాలంలో విభిన్న రూపాన్ని సంతరించుకుంటాయి. బురుజులు, ఫిరంగులు, ఇతర భవనాలు చాల అద్భుతంగా ఉంటాయి.

గోవాలోని వర్షాకాలంలో సందర్శించడానికి చోరా, దివార్ ద్వీపాల్లో పచ్చని వరి పొలాలు, దట్టమైన మడ అడవులు పర్యాటకులను ఆకర్షిస్తాయి.