ఫ్రెండ్షిప్ డేకి స్నేహితులతో చిల్.. బెస్ట్ పార్టీ ప్లాన్స్ ఇవే..
01 August 2025
Prudvi Battula
ఫ్రెండ్షిప్ డేకి స్నేహితులతో హాయిగా గడపటానికి బీచ్ లేదా ఏదైనా సరస్సు దగ్గరకి పిక్నిక్ ప్లాన్ చెయ్యండి.
స్నేహితుల కోసం బోర్డు గేమ్‌లు, కార్డ్ గేమ్‌లు, వీడియో గేమ్‌లతో గేమ్ నైట్‌ను ప్లాన్ చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేయండి.
మీకు ఇష్టమైన సినిమాలతో స్నాక్స్, పానీయాలు ఆస్వాదిస్తూ మూవీ మారథాన్‌ను ప్లాన్ చేయండి. ఫ్రెండ్షిప్ మూవీస్ అయితే ఇంకా బెస్ట్.
అందరూ పంచుకోవడానికి ఒక వంటకం తెచ్చి, వివిధ రకాల వంటకాలను ఆస్వాదించే పాట్‌లక్ పార్టీని స్నేహితుల దినోత్సవం రోజున నిర్వహించండి.
కరోకే మెషీన్ అద్దెకు తీసుకోని లేదా స్మార్ట్‌ఫోన్ యాప్ ఉపయోగించి మీకు ఇష్టమైన పాటలను పడుతూ స్నేహితులతో కరోకే నైట్ ప్లాన్ చేయవచ్చు.
మీరు, మీ స్నేహితులు సొంత నగలు, అలంకరణలు లేదా కళను తయారు చేసుకోగలిగే క్రాఫ్ట్ పార్టీని నిర్వహించండి. అయితే మీకు అలాంటివి వస్తేనే.
మీ స్నేహితులకు మసాజ్‌లు, ఫేషియల్స్, ఇతర పాంపరింగ్ చికిత్సలతో పూర్తి విశ్రాంతి స్పా రోజును ఫ్రెండ్షిప్ డేకి అందించండి.
స్నేహితులతో సరదాగా గడపడానికి గ్రిల్డ్ ఫుడ్, రిఫ్రెషింగ్ పానీయాలు, ఆటలతో బ్యాక్‌యార్డ్ బార్బెక్యూను నిర్వహించండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కరివేపాకు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి దివ్యఔషధం..
తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయా.? వాస్తవం ఏంటి.?
భారతీయ వివాహ ఆచారాల వెనుక ఇంత సైన్స్ ఉందా.?