గులాబీ మొక్కకు గుత్తులుగా పూలు పూయాలంటే..

10 September 2023

రంగురంగుల గులాబీలు కనువిందు చేయడంతోపాటు మనసునూ ఆనందంతో నింపేస్తాయి. ఐతే కొందరు గులాబీ మొక్కలను ఇష్టం పెంచుకుంటుంటారు

రకరకాల గులాబీ మొక్కలు ఇంటి పెరట్లో పెంచుకోవడానికి నర్సరీ నుంచి తెప్పించుకుంటుంటారు

నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు గుత్తులు గుత్తులుగా గులాబీలు పూస్తాయి. ఆ తర్వాత అవి ఆగిపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు

అలాకాకుండా నిత్యం మీ పెరట్లో గులాబీ మొక్కలకు గుత్తులుగా గులాబీలు పూయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి

గులాబీ మొక్కకు కొమ్మలు అధికంగా ఉంటే వాటిని కత్తిరించాలి. ప్రధాన కొమ్మ మాత్రమే ఉంచి మిగిలిన కొమ్మలన్నింటినీ ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి

పేడ ముద్దలను తయారు చేసి కత్తిరించిన కొమ్మల చివరన తొడిగితే త్వరగా కొత్త చిగుళ్లు వచ్చి మొక్క చక్కగా పెరుగుతుంది.

నర్సరీ నుంచి తెచ్చిన గులాబీ మొక్కలను ఇంటి పెరట్లో లేదా కుండీలో నాటే ముందు వర్మీకంపోస్ట్‌, కోకోపీట్‌, కాస్త వేపపిండి మట్టిలో వేసి బాగా కలుపుకోవాలి

ఇలా కలిపిన మట్టిని పదిరోజులు సూర్యకాంతి తగలని చోట భద్రపరచాలి.. ఇలా చేస్తే మొక్కకు మంచి పోషణ అందించేలా మట్టి సారవంతమవుతుంది. 

మట్టిలో పీహెచ్‌ శాతం 4 నుంచి 6 మధ్య ఉండేలా చూసుకోవాలి. అలాగే లీటరు నీళ్లలో రెండు గ్రాముల సల్ఫర్‌ కలిపి మొక్క ఆకులపై చల్లితే గులాబీలు గుత్తులుగా నిండుగా విచ్చుకుంటాయి.