ఎండాకాలంలో వేడిమి, ఉక్కపోత కారణంగా చెమటతో ఇబ్బంది పడాల్సొస్తుంది. చెమట వల్ల కొందరిలో తీవ్ర దుర్వాసన సమస్య తలెత్తుతుంది
చెమట పట్టిన దుస్తులతో ఎక్కువ సమయం ఉంటే ఫంగల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు నిలయంగా మారుతాయి. చర్మ సమస్యలు, శరీరం దుర్వాసన రావడానికి ఇదే ప్రధాన కారణం
చెమట వాసనను దూరం చేయడానికి కొందరు రసాయనాలతో కూడిన బాడీస్ప్రేలూ, సెంట్‌లూ, డియోడరెంట్లూ వాడుతుంటారు. వీటికి బదులుగా సహజ పదార్థాలతో సమస్యను దూరం చేసుకోవచ్చు
రెండు చెంచాల టీట్రీ ఆయిల్‌కీ, అదే పరిమాణంలో నీటిని కలిపి ఓ స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చెమట ఎక్కువ పట్టే భాగాల్లో స్ర్పే చేస్తే సరి
టీట్రీ ఆయిల్ సహజ క్రిమినాశినిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దుర్వాసనను దూరం చేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచడంలో గ్రీన్‌టీ ఆకులు ఉపయోగపడతాయి
గ్రీన్‌టీ ఆకులను వేడినీళ్లల్లో మరిగించి, చల్లారాక అందులో దూదిని ముంచి, చెమట వాసన ఉండే శరీర భాగాల్లో తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటే క్రమంగా వాసన దూరం అవుతుంది
చెమట వాసన రావడానికి శరీరంలోని పీహెచ్ స్థాయులు కూడా ఓ కారణమే. నిమ్మరసం, మొక్కజొన్న పిండిని రెండు చెంచాల చొప్పున తీసుకుని పేస్టు చేసుకుని చంకల్లో రాసి పదినిమిషాలు మర్దన చేయాలి
ఇలా రోజుకోసారి చేస్తే చెడువాసన నెమ్మదిగా దూరం అమవుతుంది. టొమాటో, నిమ్మరసాల్నీ సమపాళ్లలో తీసుకుని చెమట వాసన వచ్చే చోట రాసి 10 ని.. తర్వాత కడిగేస్తే చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది