కాస్త కంటి హెల్త్‌పై కూడా ఓ కన్నేయండి.. 

09 november 2023

ఎండ వల్ల కళ్లకు ఎలాంటి హాని జరగకూడదంటే బయటకు వెళ్లేప్పుడు యూవీ ప్రొటెక్షన్‌ ఉండే సన్‌ గ్లాసెస్‌ను ధరించడం అలవాటు చేసుకోవాలి.

ఇక ఎక్కువ సమయం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే వారికి కంట్లో మంటలు, నీరు కారడం వంటి సమస్యలు వస్తుంటాయి. 

ఇలా గంటల తరబడి ల్యాప్‌టాప్‌లతో గడిపే వారు వీలైనంత వరకు తరచూ గ్యాప్‌ ఇవ్వడం మంచిది. అదే పనిగా స్క్రీన్‌ను చూడకుండా అప్పుడప్పుడు చూపు పక్కకు తిప్పుతుండాలి. 

కళ్లు పొడిబారినట్లు అనిపించినా, ఎర్రగా మారినా, నీరు కారుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

అప్పుడప్పుడు కళ్లు మూసుకొని ప్రశాంతంగా గడపాలి. అదే పనిగా స్క్రీన్‌లను చూడడం వల్ల కంటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

ఇక తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. విటమిన్‌ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆకుకూరఉల తీసుకోవాలి. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ సైతం కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

కంటిపై ఒత్తిడి ఎక్కువగా పడే పనులు చేసే వారు కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో కంటికి సరిగ్గా ఆక్సిజన్‌ అందుతుంది.