రాగులతో రోగాలు దూరం.. అందం,ఆరోగ్యం..!

Jyothi Gadda

14 November 2024

TV9 Telugu

రాగులు తినడం వల్ల కలిగే లాభాలనే చెప్పాలి. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన రాగులు తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు దూరంగా ఉండొచ్చట. 

TV9 Telugu

రాగుల్లో ఫైబర్​ సమృద్ధిగా ఉంటుంది. అసంతృప్త కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. రాగుల పిండితో ఇడ్లీ, జావ, దోసలు రకాల బ్రేక్​ఫాస్ట్​లను తయారు చేసుకొని తినవచ్చు. 

TV9 Telugu

బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు చక్కటి ఆహార పదార్థమని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో అధికంగా లభించే ఫైబర్​ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

TV9 Telugu

రాగులతో ఆహారం చాలా సేపటి వరకు కడపును నిండుగా ఉంచుతుంది. ఫిట్​నెస్​ ప్రియులు, ఉబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు, రాగులు తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంటుంది. 

TV9 Telugu

రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయి.

TV9 Telugu

రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే రాగుల్లో ఫైబర్​ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

TV9 Telugu

రాగుల్లోని ఫైబర్​ మీ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. దీంతో పాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి ఇతర జీర్ణ రుగ్మతలను నయం చేస్తాయి.

TV9 Telugu

పాల పదార్థాలతో పోలస్తే రాగిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవటంలో కాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎములకల్లో బలం పెరుగుతుంది.

TV9 Telugu

అలాగే బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు చాలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు.

TV9 Telugu