TV9 Telugu
29 March 2024
ఆరోగ్యంగా ఉండాలా.?
ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్‌తో చేసిన వస్తువులకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ఫుడ్ ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
కాఫీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమితో పాటు మరెన్నో సమస్యలకు కారణమవుతుంది. దీంతో అనారోగ్యంబారినపడుతారు. కాబట్టి కాఫీకి దూరంగా ఉండాలి.
అనారోగ్యం బారిన తక్కువ పడాలంటే ప్యాకేజ్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇందులో ఎక్కువగా ఉప్పుడ కంటెంట్ కారణంగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌లో ఉండే చక్కెర కారణంగా అనారోగ్యంబారిన పడే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. శరీరంలో చక్కెర కంటెంట్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తగిన నిద్ర ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని ఉండడానికి వెంటనే మానేయాలి. ఇలా చేయడం వల్ల ఊబకాయంతో పాటు మరెన్నో సమస్యలు వస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..