16 June 2024

వానా కాలం ఇన్ఫెక్షన్లకు..  ఈ పండ్లతో చెక్ 

Narender.Vaitla

ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న వ్యాధులకు చెక్‌ పెట్టటడంలో  బెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని ఐరన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు వ్యాధులను నయం చేస్తుంది.

లిచీ పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తి సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పియర్స్‌ పండ్లు అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తేమ కారణంగా తలెత్తే సమస్యలకు చెక్‌ పెడుతుంది.

వర్షాకాలంలో కచ్చితంగా భాగం చేసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో చెర్రీస్‌ ఒకటి. ఇందులో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు అంటు వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది.

వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిసిందే. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో యాపిల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతాయి.

 పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.