డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కచ్చితంగా వేసవిలో పుచ్చకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని వాటర్ కంటెంట్ ఎంతో మేలు చేస్తోంది.
కొబ్బరి బోండంను ప్రతీరోజూ తీసుకోవడం వల్ల సమ్మర్‌లో డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందులోని మినరల్స్ బాడీకి శక్తికి అందిస్తాయి.
మస్క్‌మలాన్ కూడా సమ్మర్‌లో కచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో ఒకటి. ఇందులోని వాటర్ కంటెంట్ శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది.
శరీరంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాడంలో బొప్పాయి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో 88 శాతం నీరు ఉంటుంది. ఇది చర్మం నిగనిగలాడేందుకు ఉపయోగపడుతుంది.
నారింజలో పుష్కలంగా లభించే విటమిన్ సీ సమ్మర్‌లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికి కాకుండా చూడడంలో ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ కనీసం ఒక్క నారింజనైనా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పైనాపిల్ కూడా వాటర్ కంటెంట్‌కు పెట్టింది పేరు. ఇందులో సుమారు 86 శాతం వరకు నీరు ఉంటుంది. కాబట్టి సమ్మర్‌లో పైనాపిల్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
కివీ ఫ్రూట్ ఇన్‌స్టాంట్ ఎనర్జీని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మర్‌లో ప్రతీ రోజూ కనీసం ఒక్క కివీ ఫ్రూట్‌నైనా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.