TV9 Telugu

31 March 2024

ఎన్ని నీళ్లు తాగినా దాహం  తీరడం లేదా.. ఇవి తినండి 

దాహం తీర్చడంలో పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులో 90 శాతం నీరు ఉండడమే దీనికి కారణం. కాబట్టి సమ్మర్‌లో పుచ్చకాయ తీసుకుంటే దాహం తీరిపోతుంది. 

ఇక సమ్మర్‌లో తీసుకోవాల్సిన మరో ఫ్రూట్‌ కర్బూజ. ఇందులో కూడా 90 శాతం ననీరు ఉంటుంది. ఇందులో విటమిన్‌ సి,ఈ రోగనిరోధక శక్తి తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ఎండాకాలంలో దాహార్తిని తీర్చడంలో బత్తాయిలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్లు ఆరోగ్యానికిఎ మేలు చేస్తాయి. సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు

పైనాపిల్‌ కూడా దాహార్తిని తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో 87 శాతం నీరు ఉంటుంది. ఇందులోని విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. 

కీరదోస కూడా సమ్మర్‌లో కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని 95 శాతం నీరు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూడడంలో ఉపయోగపడుతుంది.

సమ్మర్‌లో స్ట్రాబెర్రీ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 91 శాతం నీరు ఉంటుంది. కాబట్టి సమ్మర్‌లో రోజుకు ఒక్కటి స్ట్రాబెర్రీ తీసుకుంటే డీ హైడ్రేషన్‌ సమస్య దరిచేరదు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.