కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్లు తినాల్సిందే 

Narender Vaitla

17 October 2024

కాన్‌ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇవి కిడ్నీలు ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడడంలో ఉపయోగపడుతుంది.

నిమ్మకాయలు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ సి మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

కిడ్నీలకు మేలు చేసే వాటిలో పుచ్చకాయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని వాటర్‌ కంటెంట్ టాక్సిన్లను బయటికి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

యాపిల్స్‌ కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో కిడ్నీ పనితీరు మెరుగవుతుంది.

మూత్ర పిండాలు శుభ్రపరచడంలో కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామెటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

సిట్రస్‌ జాతికి చెందిన నారింజ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. 

బొప్పాయితో కూడా కిడ్నీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.