మల బద్ధకంతో బాధపడేవారు జామను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుపరిచి. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
యాపిల్ పండులో కూడా ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ఆపిల్ పండ్లను తింటే సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది.
కివి పండ్లు కూడా మలబద్ధకాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడేవారు కివిని తీసుకుంటే ఇందులోని యాక్టివిటీన్ అనే ఎంజైమ్ జీర్ణాశయానికి మేలు చేస్తుంది.
ఫైబర్ కంటెంట్‌కు పెట్టింది పేరు బొప్పాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అజీర్తి, పేగు కదలికలు తగ్గడం వంటి సమస్యలకు ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు.
ఇక మలబద్ధకానికి అరటి పండు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ రాత్రి ఒక అరటి పండు తీసుకుంటే. ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుందని వైద్యులు సూచిస్తుంటారు.
నీటి శాతం అధికంగా ఉండే పియర్ పండు కూడా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. పియర్ పండును రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ సమస్యలు దరిచేరవు.
మల బద్ధకాన్ని తగ్గించడంలో ఆరెంజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల్లో పేరుకుపోయిన మురికి బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.