ప్రకృతి పుట్టినిల్లు విశాఖలో ఇవి కచ్చితంగా తినాల్సిందే..

TV9 Telugu

27 May 2024

వైజాగ్ వెళ్లినవారు బీచ్ కి వెళ్లకుండా అస్సలు ఉండరు. బీచ్ దగ్గర ఎక్కువగా లభించే మురి మిక్సర్ తినాల్సిందే.

దీని తర్వాత వెంటనే చెప్పుకోవలసినది జగదాంబలో ఉన్న ఫుడ్ స్ట్రీట్ లో చికెన్ కబాబ్స్. వీటి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్.

విశాఖ నగరంలో ఎంవిపి కాలనీలో పునుగులు. కారంతో పాటు కొన్ని చట్నీలతో సర్వ్ చేసే ఈ స్నాక్ చాల రుచికరంగా ఉంటుంది.

విశాఖపట్నం ద్వారకానగర్ ఫస్ట్ లైన్ లో ఉన్న ఓ చిన్ని తోపుడు బండిపై టమాట బజ్జి టేస్ట్ చూస్తే ఆహా అనాల్సిందే.

వైజాగ్ కి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడుగుల గ్రామంలో విరివిగా దొరిగే హల్వాని లైఫ్ ఒక్కసారైన తినాలి.

విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో ఎస్.కోటలో ఉన్న ముంతాజ్ హోటల్ లో బిర్యానీ తింటే అస్సలు ఎప్పటికి మర్చిపోలేరు.

వైజాగ్ కి 100 కి. మీ. దూరంలో ఉన్న ఆంధ్ర ఊటీ అదేనండి అరకులో బాంబు చికెన్ కచ్చితంగా తినాల్సిందే. ఇది రుచి అమోగం.

మీరు కాఫీ ఎక్కువగా ఇష్టపడేవారైతే అరకులో కాఫీ ఒక్కసారి టేస్ట్ చేయండి. అక్కడ కాఫీ గింజలు కూడా విక్రయిస్తారు.