TV9 Telugu

24 March 2024

ఇవి తింటే రక్తం గడ్డ కట్టదు.. 

రక్తం గడ్డకట్టకుండ ఉంచడంలో ఆకు కూరలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

వెల్లుల్లిలో రక్తం గడ్డలను విడదీసే లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తం పలుచగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో వచ్చే గడ్డలను కరిగించడంలో ఉపయోగపడుతుంది.

రక్తం గడ్డకట్టకుండా ఉండడంలో అల్లం కూడా కీకల పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

ప్రతీరోజూ కచ్చితంగా ఉల్లిపాలయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సమ్మేళనాలు ప్లేట్‌లె్స్‌ అంటుకోకుండా చూస్తాయి. దీంతో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

అవిసెగింజలు కూడా రక్తం గడ్డకట్టకుండా ఉండడంలో సహాయపడతాయి. కచ్చితంగా రోజు అవిసెగింజలను తీసుకోవాలని చెబుతున్నారు.

 డ్రైఫ్రూట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో రక్త ప్రవాహం సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

చేపలు కూడా రక్త సరఫరా సాఫీగా సాగడానికి ఉపయోగపడతాయి. ఇవి ధమనుల్లో కొవ్వు నిల్వల్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం