TV9 Telugu

22 March 2024

కడుపుబ్బరం వేధిస్తుందా.? 

దోసకాయలు కడుపు సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు జీర్ణ శక్తిని మెరుగ్గా చేస్తుంది. 

జీర్ణ వ్యవస్థకు మేలు చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

అరటి పండులోని పొటాషియం కడుపు ఉబ్బరం సమస్యను దూరం చేస్తుంది. రోజూ రాత్రి ఒక అరటి పండు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

మంచి ప్రోబయాటిక్‌కు పెరుగు పెట్టింది పేరు. ఇందులోని మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది కడుపుబ్బరంను దూరం చేస్తుంది.

ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఓట్స్‌ కూడా కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం టిఫిన్‌గా ఓట్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుంది.

జీవక్రియలను మెరుగుపరచడంలో గ్రీన్‌ టీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో సద్గుణాలు కడుపు ఆరోగ్యాన్నా కాపాడుతాయి

కడుపుబ్బరాన్ని తగ్గించడంలో సిట్రస్‌ పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.