లూజ్ మోషన్స్‌కు అరటి పండు దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని పొటాషియం మంచి జీర్ణ క్రియకు దోహదపడుతుంది. ఫైబర్ కూడా కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
డయేరియాతో బాధపడితే పెరుగును తీసుకోవాలి. దీనిలోని ప్రోబయోటిక్ మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఫలితం జీర్ణక్రియ మెరుగవుతుంది.
లూజ్ మోషన్స్ సమస్య వేధిస్తుంటే యాపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పొట్టు తీసిన వాటిని తీసుకోవడం ఉత్తమం.
లూజ్ మోషన్స్ బారిన పడిన వారు ఓట్స్‌ను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌ను పాలలో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు బలదూర్ అవుతాయి.
లూజ్ మోషన్స్ కారణంగా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. కాబట్టి దీనిని భర్తీ చేయడానికి కొబ్బరి నీటిని తీసుకోవాలి. రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర కూడా డయేరియాకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గినెన్నలో కొంత నీరు పోసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి. అనంతరం చల్లార్చిన తర్వాత తాగాలి.
మజ్జిగ కూడా డయేరియా సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. మజ్జిగలో కొంత నిమ్మరసం పిండుకొని తాగితే కడుపు నొప్పి తగ్గుతుందని చెబతారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.