ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారంతో గర్భాశయం ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిలో ప్రధానమైనవి పాన్‌కేక్‌లు, ఫ్రైడ్ చికెన్, కుకీలు, ఐస్ క్రీమ్‌లను ఎక్కువగా తీసుకుంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ కారణంగా మహిళల్లో గర్భాశయం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ శరీరంలోని ఈస్ట్రోజెన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో గర్భాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఇంప్లాంటేషన్ ప్రక్రియ దెబ్బ తింటుంది. దీర్ఘకాలంలో గర్భాశయంపై ప్రభావం చూపుతుంది.
ఇక గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఫుడ్స్‌ను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.
పొటాషియం అధికంగా లభించే అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక విటమిన్ సి లభించే నిమ్మజాతి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నారింజను క్రమంతప్పకుండా తీసుకుంటే మేలు జరుగుతుంది.
గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నట్స్‌ను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మేలు చేస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.