శీతాకాలంలో చాలా మందిలో వచ్చే ప్రధాన సమస్య ఊపిరితిత్తులకు సంబంధించినదే ఉంటుంది. చలి, మంచి కారణంగా లంగ్స్ ఆరోగ్యం పాడవుతుంది.
అందుకే ఈ సీజన్‌లో లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఊపిరితిత్తులు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే వెల్లుల్లి బెస్ట్ ఆప్షన్. ఇది బెస్ట్ యాంటీ బయోటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది.
పసుపు కూడా లంగ్స్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలలో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లో వాపు, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.
శీతాకాలంలో సహజంగా వచ్చే దగ్గు, జలుబు వస్తుంటుంది. దీనికి విరుగుడు అల్లం. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసకోశ నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో తేనె కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాస కోశ సమస్యల్ని తగ్గిస్తాయి.
లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీని అలవాటు చేసకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగితే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.