నిత్యం అలసటగా ఉంటుందా.? 

10 November 2023

అరటి పండు మంచి ఎనర్జీని అందిస్తుంది. ఇందులో పొటాషియం కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అరటి పండుతో అలసట, బద్ధకం దూరమవుతుంది. 

ఖర్జూరాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది. ఇక ఎండు ఖర్జూరాలను ఒక గ్లాసులో నీటిలో రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తాగాలి. 

శరీరం డీహైడ్రేట్ అయినా.. నీరసంగా ఉంటుంది. కాబట్టి నిత్యం నీటిని తాగుతూ ఉండాలి. వింటర్‌ అని నీరు తాగకపోతే డీహైడ్రేట్ అయ్యే అకాశం ఉంటుంది. 

నిత్యం అలసటతో ఉంటే రోజుకో కొబ్బరి బొండం తాగాలి. డీహైడ్రేషన్‌కు చెక్‌ పెట్టడంతో పాటు, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. 

ఓట్స్‌లోని కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. నిత్యం ఓట్స్‌ను ఏదో ఒక సమయంలో తీసుకుంటూ ఉంటే శరీరానికి బలాన్ని అందిస్తుంది. 

పెరుగులోని ప్రోటీన్‌ కూడా శరీరానికి బలాన్ని అందిస్తుంది. రోజుకు ఒక గిన్నె పెరుగును అన్నంతో కానీ, నేరుగా కానీ తీసుకోవాలి. 

గ్రీన్‌ టీని బరువు తగ్గడానికి మాత్రమే అనుకుంటాం. కానీ నిత్యం గ్రీన్‌ టీని తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు శక్తి కూడా లభిస్తుంది. 

శరీరానికి ఇన్‌స్టాంట్‌ శక్తిని అందించే వాటిలో యాపిల్ ఒకటి. యాపిల్స్‌ ఉండే ఫైబర్‌, చక్కెలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరానికి మేలు చేస్తాయి.