నిత్యం కోపంతో ఊగిపోయే వారు అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వంటివి శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి.
కోపం ఎక్కువగా ఉన్న వారు పసుపును ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్లను ప్రేరేరిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
కోపం తగ్గించడంలో బాదం సూపర్ ఫుడ్‌గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదంలో పుష్కలంగా కాల్షియం శరీరంలోని నరాలు, కండరాల కణాలకు ప్రశాంతతను ఇస్తుంది.
అవిసె గింజలు కూడా కోపాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోపగుడుతంది. ఇందులోని ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ మానసిక రుగ్మతలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో కోపం తగ్గుతుంది.
కివి పండు విటమిన్ సికి పెట్టింది పేరు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో కోపం కూడా దూరమవుతుంది
కోపాన్ని తగ్గించడలో ఆకు కూరలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని మెగ్నీషియం రక్తపోటును అదుపు చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.