చలికాలంలో ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఏ, సీ, కేలతో పాటు ఫోలిక్ యాసిడ్ మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆలుగడ్డలోని విటమిన్ సీ, బీ6 పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు చలికాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
శరీరానికి వెచ్చదనం కల్పించడంలో బెల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది. బెల్లంలో సమృద్ధిగా ఉండే ఐరన్‌తో రక్తహీనత తగ్గుతుంది. జీర్ణక్రియ రేటు మెరుగవుతుంది.
చలికాలంలో ఆరోగ్యం బాగుండాలంటే తేనెను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెండంతో పాటు ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు.
చలి కాలంలో ఆహారంలో అల్లాన్ని కచ్చితంగా భాగం చేసుకోవాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడొచ్చు.
నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరనివ్వకుండా నెయ్యి ఉపయోగపడుతుంది.
చలికాలంలో సిట్రస్ పండ్లను తీసుకోవాలి. ఆరెంజ్, కివి, బొప్పాయి, జామ వంటి పండ్లతో జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది.
సోరకాయలో కూడా మంచి ఔషధగుణాలు ఉంటాయి. ఇందులోని విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ బీ6, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.